గణపతి, లేదా వినాయకుడు, సనాతన ధర్మంలో అత్యంత ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు భారతదేశంలోనే కాక, నేపాల్, శ్రీలంక, థాయ్ లాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లోనూ, భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజి, మారిషస్, ట్రినిడాడ్- టుబాగో లాంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. హిందువుల్లో ప్రధానంగా ఐదురకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా, వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించడం కద్దు. గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధమతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది.
గణేశుని అనేక విశేషణాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా (విఘ్నేశ్వరుడు), కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించేటపుడు కృతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తుంటారు. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టుక, లీలల గురించి అనేక పౌరాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి.
గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి, శుభకార్యాలు సకల విఘ్నాలకు అతీతంగా జరుగుతాయి, జ్ఞానం, విద్య, సంపదలు కలుగుతాయి, కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి
32 గణపతుల మూర్తులు
1.బాలగణపతి,
2.తరుణ గణపతి,
3.భక్తిగణపతి,
4.వీరగణపతి,
5.శక్తిగణపతి,
6.ద్విజగణపతి,
7.సిద్ధగణపతి,
8.ఉచ్చిష్టగణపతి,
9. విఘ్నగణపతి,
10.క్షిప్రగణపతి,
11.హేరంబగణపతి,
12.లక్ష్మీగణపతి,
13.మహాగణపతి,
14. విజయగణపతి,
15.నృత్తగణపతి,
16.ఊర్ధ్వగణపతి,
17.ఏకాక్షరగణపతి,
18.వరగణపతి,
19.త్య్రక్షరగణపతి,
20.క్షిప్రదాయకగణపతి,
21.హరిద్రాగణపతి,
22.ఏకదంతగణపతి,
23.సృష్టిగణపతి,
24.ఉద్దండ గణపతి,
25.ఋణవిమోచక గణపతి,
26.డుంఢి గణపతి,
27.ద్విముఖ గణపతి,
28.త్రిముఖగణపతి,
29.సింహగణపతి,
30.యోగ గణపతి,
31.దుర్గాగణపతి,
32.సంకటహరగణపతి.(ముద్గల పురాణం ప్రకారం )